కరోనా భయానికి చేతులెత్తేసిన సుమ, అనసూయా

anchor suma anasuya

కరోనా వైరస్ విజృంభనకు ఇప్పుడు ప్రతి ఒక్కరిలో భయం డోస్ పెరుగుతోంది. దేశంలో 9లక్షలకు పైగా కేసులు నమోదవ్వడంతో ఎవరికి వారే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోతున్నారు. ఇక టాలీవుడ్ టాప్ యాంకర్స్ సుమ, అనసూయ భరద్వాజ్ కూడా వారి షూటింగ్స్ విషయంలో ఏమి చేయలేక చివరికి చేతులు ఎత్తేసినట్లు తెలుస్తోంది.

లాక్ డౌన్ అనంతరం సుమ క్యాష్ షోతో పాటు ఇతర ప్రోగ్రామ్ లతో కాస్త బిజీ అయిన విషయం తెలిసిందే. అయితే బుల్లితెర కోసం పని చేసే వారికి కరోనా ఇబ్బందులు తప్పడం లేదు. కరోనా వైరస్ మునుపటి కంటే వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో సుమ సడన్ గా తన ప్రస్తుత షెడ్యూల్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకుందట.

మరో వైపు జబర్దస్త్ యాంకర్ అనసూయా భరద్వాజ్ కూడా షూటింగ్స్ లో పాల్గొనడానికి ధైర్యం చేయడం లేదట. సుమ తరహాలోనే ఆమె కూడా షెడ్యూల్స్ ని క్యాన్సిల్ చేసుకొని ఇంటికే పరిమితమయినట్లు సమాచారం. ఇక మరికొంత మంది సినీ నటులు కరోనా తగ్గే వరకు షూటింగ్స్ కి వెళ్లకూడదని బలంగా నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది.