అందుకే ‘పుష్ప’ సినిమాను రిజెక్ట్ చేశాను – విజయ్ సేతుపతి

vijay sethupathi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా పుష్ప కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కేవలం సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మొదటిసారి బన్నీ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ పై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చాడు.

పుష్ప సినిమాలో విజయ్ సేతుపతిని ఒక పాత్ర కోసం సుకుమార్ సంప్రదించిన విషయం తెలిసిందే. కానీ అందుకు ఆ యాక్టర్ ఒప్పుకోకపోవడంతో రెమ్యునరేషన్ అనుకున్నంతగా ఇవ్వకపోవడం వల్లే రిజెక్ట్ చేశాడని టాక్ వచ్చింది. అయితే ఇటీవల తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు.

కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు పెండింగ్ లో పడ్డాయి అంటూ.. ముందు వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పుష్ప సినిమాను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని కేవలం డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే పుష్ప సినిమా చేయడానికి ఒప్పుకోలేదని విజయ్ సేతుపతి చాలా క్లియర్ గా చెప్పాడు. దీంతో ముందు వచ్చిన రూమర్స్ అబద్ధమని అభిమానులకు ఒక క్లారిటీ వచ్చేసింది.