వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి ఆవిష్క‌రించిన కేవి గుహ‌న్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ !!

118వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ రెండో చిత్రంగా తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందిస్తోన్నమిస్ట‌రి థ్రిల్ల‌ర్‌డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు`(ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు)
. అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు ధా‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల విడుద‌ల‌చేసిన ప్రీలుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి రిలీజ్‌చేశారు. ఈ సంద‌ర్భంగా..

వెర్స‌టైల్ హీరో రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ – గుహ‌న్ గారు ఒక యూనిక్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఆయ‌న‌తో క‌లిసి వ‌ర్క్ చేశాను. `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` పోస్ట‌ర్ చూస్తుంటే హై కాన్సెప్ట్ ఫిలిం అని తెలుస్తోంది. ఈ సిని‌మాలో కూడా విజువ‌ల్స్ త‌ప్ప‌కుండా స‌రికొత్త‌గా ఉంటాయి. గుహ‌న్‌గారు ఇలాంటి మూవీస్ మ‌రెన్నో తీయాల‌ని కోరుకుంటున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కేవి గుహ‌న్ మాట్లాడుతూ – నా ఫ‌స్ట్ మూవీ 118 త‌ర్వాత నెక్ట్స్ ఏంటి అని ఆలోచిస్తున్న‌ప్పుడు లాక్‌డౌన్‌లో ఒక కొత్త కాన్సెప్ట్ అనుకుని `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` సినిమా చేయ‌డం జ‌రిగింది. ఇది ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఔట్‌పుట్ పట్ల మా టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం. మా మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రానా గారికి థ్యాంక్స్‌. రానా గారు కొత్త త‌ర‌హా చిత్రాల‌ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. త్వ‌ర‌లోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

చిత్ర నిర్మాత డా. ర‌వి పి.రాజు ధాట్ల మాట్లాడుతూ – మా మూవీ ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన రానా గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. గుహ‌న్ గారు సినిమా ఎక్స్‌ట్రార్డిన‌రీగా తీశారు. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అనేది చాలా కామ‌న్ వ‌ర్డ్‌..ఈ క‌థ‌కి ఇది యాప్ట్ టైటిల్‌. తెలుగు, త‌మిళ్ రెండు భాష‌ల‌లో షూట్‌చేశాం. అథిత్ హీరోగా న‌టిస్తున్నాడు. శివాని రాజ‌శేఖ‌ర్ ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఇంట్ర‌డ్యూస్ అవుతోంది. ఆడియ‌న్స్ ని క‌చ్చితంగా థ్రిల్ చేసే సినిమా `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు అన్నారు.

హీరో అథిత్ అరుణ్ మాట్లాడుతూ – 118 త‌ర్వాత కేవి గుహ‌న్‌గారు చేస్తోన్న చిత్ర‌మిది. షార్ట్ టైమ్‌లో ప్లాన్ చేసి ఒక కొత్త కాన్సెప్ట్‌తో `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` మూవీని తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. మా మూవీ ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేసి మాకు స‌పోర్ట్ చేసిన రానా గారికి థ్యాంక్స్‌ అన్నారు.

హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ – కేవి గుహ‌న్ గారు అమేజింగ్ సినిమాటోగ్రాఫ‌‌ర్. ఆయ‌న సినిమాలో న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. నా ఫ‌స్ట్ ఫిలిం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లాంచ్ చేసిన రానా గారికి థాంక్స్‌ అన్నారు.

కో – ప్రొడ్యూస‌ర్ విజ‌య్ ధ‌ర‌న్ ధాట్ల మాట్లాడుతూ – మా టీమ్ అంద‌రి త‌రుపున రానా గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు ఒక స్పెష‌ల్ మూవీ. టాప్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమాకి వ‌ర్క్ చేయ‌డం జ‌రిగింది. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోంది. తెలుగు, త‌మిళ భాష‌లలో ఒకేసారి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్,
సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,
ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,
ఆర్ట్‌: నిఖిల్ హ‌స‌న్‌,
డైలాగ్స్‌: మిర్చి కిర‌ణ్‌,
లిరిక్స్‌: రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత‌ శ్రీ‌రామ్‌,
కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్,
స్టంట్స్‌: రియ‌ల్ స‌తీష్‌,
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: పొన్మ‌ని గుహ‌న్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: కె. రవి కుమార్‌,
కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ ధాట్ల,
నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు ధాట్ల,
క‌థ‌, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కె వి గుహ‌న్‌.