వీరశంకర్ ప్యానల్ ఘన విజయం – TFDA వైస్ ప్రెసిడెంట్స్ గా వశిష్ఠ, సాయి రాజేష్

ఈ రోజు తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలలో 3 సంఘాలు పోటీ చేయగా వీరశంకర్ ప్యానెల్ విజయం సాధించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వసిష్ఠ & సాయి రాజేష్ లను వైస్ ప్రెసిడెంట్స్ గా ఎంపిక చేయడం జరిగింది.
ఈ ఎన్నికలలో మొత్తం 1113 ఓట్లు పాడగా, వాటిల్లో వీర శంకర్ కు 536 వచ్చాయి. అలాగే సముద్రకు 304 ఓట్లు, రామ్ ప్రసాద్ కు వచ్చిన 245 ఓట్లు, రవికుమార్ చౌదరి 11 ఓట్లు, రాజారెడ్డి 2 ఓట్లు వచ్చాయి.
అలాగే వైస్ ప్రెసిడెంట్ సాయి రాజేష్ కు వచ్చిన 576 ఓట్లు, వశిష్ట 355 రావడం జరిగింది. జనరల్ సెక్రటరీగా సుబ్బారెడ్డి 396 ఓట్లతో విజయం దక్కింది.