హీరోయిన్‌కి షాకిచ్చిన హ్యాకర్స్

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్. తాజాగా ఆమెకు హ్యాకర్స్ షాక్ ఇచ్చారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. తన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు గురయ్యాయని, యాక్సెస్ చేయలేకపోతున్నట్లు వరలక్ష్మీ శరత్‌కుమార్ చెప్పారు. గుర్తు తెలియని వారు తన అకౌంట్ హ్యాక్ చేశారని అనుమానంగా ఉందని, ప్రస్తుతం తాను కూడా అకౌంట్‌లను ఓపెన్ చేయలేకపోతున్నట్లు ఆమె చెప్పింది. తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో కొన్నిరోజుల పాటు ఏమైనా పోస్ట్ అయితే అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరింది.

VARALAKSHMI SARATHKUMAR

తన ట్విట్టర్‌తో పాటు ఇన్‌స్ట్రామ్ హ్యాక్ అయినట్లు వరలక్ష్మీ శరత్‌కుమార్ చెప్పింది. తన అకౌంట్‌లను రికవరీ చేసుకున్న తర్వాత మళ్లీ మీకు సమాచారం ఇస్తానంది. తెలుగులో అనేక సినిమాల్లో నటించిన శరత్‌కుమార్ తన నటనతో గుర్తింపు పొందింది. హీరోయిన్‌గానే కాకుండా క్వారెక్టర్ ఆర్టిస్, లేడీ విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తోంది.

అయితే ట్విట్టర్‌లో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై ఆమె స్పందిస్తూ ఉంటుంది.