రజనీ ‘కింగ్’ అవుతారా?

జనవరిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన తమిళ హీరో అయినా.. దేశంలోని అన్ని భాషల ప్రేక్షకులు రజనీకాంత్ సినిమాలను ఇష్టపడతారు. అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇండియాలోనే అత్యధిక మంది అభిమానులు ఉన్న హీరో రజనీకాంత్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినీయర్ హీరో అయినా.. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ టాప్ హీరోగా కొనసాగుతున్నారు.

RAJANIKANTH

రజనీకాంత్ మహారాష్ట్రలో జన్మించగా.. వాళ్ల ఫ్యామిలీ కర్ణాటకకు షిఫ్ట్ అయింది. బస్ కండక్టర్‌గా జాబ్ చేసిన రజనీకాంత్.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి తన స్ట్రైల్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో హీరోగా సక్సెస్ అయ్యారు. ఆయన ఇంద పెద్ద స్టార్‌గా ఎదగడం వెనుక ఎంతో కష్టం ఉంది. తన మార్క్ స్ట్రైల్, మ్యానరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇప్పటివరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు రజనీకాంత్. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. తాజాగా రాజకీయాల్లో వస్తున్నట్లు ఆయన చేసిన ప్రకటనతో అభిమానులు కోరిక తీరింది.

తమిళనాట రాజకీయాల్లో ఎంతోమంది సెలబ్రెటీలు రాజకీయాల్లోకి అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులు సినీ ఇండస్ట్రీ వెళ్లి రాజకీయాల్లో సక్సెస్ అయి సీఎంలు కూడా అయ్యారు. ఇప్పుడు అలాగే రజనీ కూడా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. తమిళనాడులో రజనీకి మంచి క్రేజ్ ఉంది. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో రజనీ పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశముందని చెబుతున్నారు.