నోస్టాల్జిక్ మొమెంట్… శ్రీదేవికి ట్రిబ్యూట్

Elluvochi Godaramma Song Promo

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్మీకీ. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రిలీజ్ సమయం దగ్గర పడడంతో ప్రొమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్, వాటిని మరింత స్పీడ్ పెంచుతూ మోస్ట్ అవైటెడ్ సాంగ్ ఎల్లువొచ్చి గోదావరి ప్రోమో సాంగ్ ని రిలీజ్ చేశారు. 1982లో శోభన్ బాబు, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా దేవత. కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నది ఒడ్డున, బిందెల మధ్యలో ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ ఎవర్ గ్రీన్ గా మిగిలిపోయింది. ముఖ్యంగా శ్రీదేవి డాన్స్, సెట్ డిజైన్ మరో పది దశాబ్దాలు అయినా గుర్తుండి పోతాయి. ఇప్పుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకీ సినిమాలో పూజ హెగ్డే శ్రీదేవి పాత్రలో కనిపిస్తూ ఉండడంతో, ఎల్లువొచ్చి గోదారమ్మ పాటని రీమిక్స్ చేశారు. మెగా అభిమానులంతా ఎదురు చూస్తున్న ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, ప్రాపర్టీస్, సాంగ్ కంపోజింగ్ ఇలా ప్రతి ఎలిమెంట్ చూడగానే నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగించాయి. కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఎక్కడా ఒరిజినల్ సాంగ్ ఫ్లేవర్ పోకుండా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. శ్రీదేవిగా పూజ హెగ్డే తెరపై అందంగా కనిపించింది. వరుణ్ తేజ్, పూజ హెగ్డేల పెయిర్ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ క్లాస్ సాంగ్స్ మాత్రమే ఇచ్చిన మిక్కీ జే మేయర్, ఎల్లువొచ్చి గోదారమ్మ పాటకి పూర్తిగా న్యాయం చేశాడు. మొత్తానికి పాత పాటని ఏమాత్రం చెడగొట్టకుండా, హరీశ్ శంకర్ మంచి అటెంప్ట్ చేశాడు.