మాస్ మహారాజా రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ నుంచి వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్

మాస్ మహారాజా రవితేజ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్‌’లో ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే తో అందమైన లవ్ ట్రాక్ ఉంటుంది. వాలెంటైన్స్ డే  సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ రవితేజ, భాగ్యశ్రీ  ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నట్లు చూపించే రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ మ్యాజికల్ మాస్ కాంబోలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇటివలే చిత్ర యూనిట్ కారంపూడిలో షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రానికి  మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, అయనంక బోస్ డీవోపీగా చేస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.

తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో