‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా “వకీల్ సాబ్” సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. ఓవర్సీస్ సహా విడుదలైన అన్ని సెంటర్స్ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూనానమస్ సూపర్ హిట్ రెస్పాన్స్ నేపథ్యంలో “వకీల్ సాబ్” చిత్ర బృందం హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయంలో సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ….లైఫ్ లో ఎన్నో సక్సెస్ లు చూశాను. నిర్మాతగా మారి 18 ఏళ్లవుతోంది. డిస్ట్రిబ్యూటర్ గా అంతకుముందు నుంచే విజయాలు చూశాను. అయితే వకీల్ సాబ్ సక్సెస్ ఎందుకో కొత్తగా అనిపిస్తోంది. ఉదయం 4.30 కూకట్ పల్లిలో ప్రీమియర్ షోస్ చూశాను. ఆ ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూస్తుంటే నన్ను నేను మర్చిపోయాను. నిర్మాతనని మర్చిపోయి ఫ్యాన్స్ లాగే పేపర్స్ విసిరేశాను. పది నిమిషాల తర్వాత రియలైజ్ అయ్యాను. వకీల్ సాబ్ మీద మాసివ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమాను ఒక్కో స్టేజీలో చూస్తుంటే ఇలాంటి ఘన విజయాన్ని అంచనా వేశాం. ప్రేక్షకులు, అభిమానుల మధ్యలో సినిమా చూస్తుంటే ఒక అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. అప్పటికే అమెరికా, దుబాయ్ షోస్ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. విదేశాల నుంచి సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. వకీల్ సాబ్ విజయం నాకు కొత్తగా అనిపించడానికి కారణం, నేను కళ్యాణ్ గారితో సినిమా చేయాలనే కోరిక కావొచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ కావొచ్చు. పవన్ గారితో పాటు ఈ సినిమా విజయం ఘనత దర్శకుడు శ్రీరామ్ వేణుకు ఇస్తాను. ఒక హీరోను ఇలా చూడాలి అనే ఆలోచనతో తను రాసుకున్న సీన్స్ కానీ, తను చేసిన ప్రెజంటేషన్ గానీ సూపర్బ్. ప్రతి సీన్ కు, ప్రతి డైలాగ్ కు ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. గంటా పదిహేను నిమిషాల సెకండాఫ్ అయితే విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు. సినిమా అయ్యాక దర్శకుడు వేణుకు కాల్ చేశాను. ఇద్దరం కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్లాము. ఆయనకు ముందుగా చెప్పలేదు, ఆ సంతోషంలో ఆయన ఇంటికి వెళ్లాం. పవన్ గారిని కలిసి సినిమా సక్సెస్ గురించి చెప్పాం. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు. కళ్యాణ్ గారు చాలా సక్సెస్ లు చూశారు కానీ వకీల్ సాబ్ లో అమ్మాయిలు, మహిళల గొప్పదనం తెలిపే కంటెంట్ ప్రేక్షకులకు రీచ్ అయితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. వేణు, పవన్ గారు ప్రతి సీన్ ఎలా చేయాలో డిస్కషన్ చేసుకుని షూట్ చేశారు. ఆ సీన్స్ ఇప్పుడు థియేటర్లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దాదాపు గంట సేపు పవన్ గారితో మాట్లాడాం. నేను ప్రసాద్ ఐమాక్స్, సుదర్శన్ థియేటర్లకు వెళ్లి అక్కడ ఆడియెన్స్ రెస్పాన్స్ గమనించాను. టెర్రఫిక్ రెస్పాన్స్ ఉంది. తెలియని అనుభూతికి లోనవుతున్నాను. ఇంతలో చాలా మంది మీడియా పర్సన్స్ ఫోన్ చేసి సినిమాను ప్రశంసిస్తూ మాట్లాడారు. మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇదొక అద్భుతమైన ఎక్సీపిరియన్స్. బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్, కళ్యాణ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటూ చెబుతున్నారు. ఈ సినిమా ఎంత సునామీ సృష్టిస్తుందో ఇప్పుడో చెప్పలేం. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్ మాత్రం ట్రెమండస్ గా ఉంది. ఏ సినిమా ఎంత డబ్బు తెస్తుందనేది నేనెప్పుడూ ఆలోచించలేదు. మంచి సినిమా చేశాక డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది. 18 ఇయర్స్ నుంచి మా సంస్థలో ఉన్న వేణు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ కు ఇంత విజయాన్ని ఇచ్చాడు. అందుకు అతన్ని సత్కరిస్తున్నాం. అన్నారు.
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ….ఓవర్సీస్ తో పాటు అన్ని ఏరియాల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు ఇలా..అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. అన్నారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పేలని అనుభూతినిచ్చింది. లైఫ్ లాంగ్ ఈ మూవ్ మెంట్స్ గుర్తుపెట్టుకుంటాను. పవన్ గారి వ్యక్తిత్వం ఒక అభిమానిగా నాకు తెలుసు. అందుకే ఆయన పాత్రకు సత్యదేవ్ అని పేరు పెట్టి, ఆయన సమాజాన్ని చూసే కోణంలోనే డైలాగ్స్ రాశాను. సత్యదేవ్ క్యారెక్టర్ ప్రజల కోస పోరాడతాడు. ఆ కోణంలోనే మాటలు రాశాం. ఇవి జనసేన పార్టీ రిలేటెడ్ గా కుదిరాయని ఎవరైనా అంటే సంతోషమే కదా. వకీల్ సాబ్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రాజు గారికి, కళ్యాణ్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. ఈ విజయం ఆర్టిస్టుల సహా కంప్లీట్ టీమ్ వర్క్. అంతా తమ బెస్ట్ వర్క్ చేశారు. మా చిత్ర బృందం అందరికీ థాంక్స్. అన్నారు. మాట్లాడుతూ…దర్శకుడు శ్రీరామ్ వేణు ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు.
దర్శకుడు శ్రీరామ్ వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ చిత్ర బృందం వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.