వ‌కీల్ సాబ్ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌పై మెగాస్టార్ చిరంజీవి ప్ర‌శంస‌లు!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు-శిరీష్ , బోనీ కపూర్ కలిసి నిర్మించారు. పింక్ రీమేక్ గా వ‌చ్చిన ఈ సినిమాపై క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిపించిన సంగ‌తి తెలిసిందే.
పవన్ దాదాపు మూడేళ్ళ తర్వాత ఒక పవర్ ఫుల్ కథ ఉన్న సినిమాలో న‌టించ‌డంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వీక్షించిన‌ మెగాస్టార్ చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా అభినందనలు తెలిపారు

మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ లో అదే వేడి.. అదే వాడి.. అదే పవర్. ప్రకాష్ రాజ్ తో కోర్ట్ రూమ్ డ్రామా అద్భుతం. నివేద థామస్, అంజలీ, అనన్య వారి పాత్రల్లో జీవించారు. థమన్ , డీఓపీ వినోద్ సినిమాకు ప్రాణం పోశారు. దిల్ రాజు, బోనీ కపూర్ .. దర్శకుడు వేణు శ్రీరామ్ కు మిగతా టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. అన్నిటికి మించి ఇది మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు అందరి మనసుల్నీ గెలుస్తాడు! అంటూ ట్వీట్ చేశారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న స్వ‌గృహంలో వ‌కీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు.. ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ క‌లిసారు. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆ ఇద్ద‌రికీ పుష్ప‌గుచ్ఛాలు అందించి విజ‌యం సాధించినందుకు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వ‌కీల్ సాబ్ ని ప్ర‌శంసించి బ్లెస్ చేసినందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మెగాస్టార్ చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.