అన్నయ్యా…మీనుండి మరెన్నో…. అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆనందాలు – ఉత్తేజ్

సాహసాల దారి
నందమూరి
బాలకృష్ణుడు
భళా కృష్ణుడు
బాపురే!! కృష్ణుడు
నట సింహుడి
“శ్రీరామ దండకం” అద్భుతః
🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నయ్యా…
పాదాభివందనం..
పదాభివందనం….

తెలుగుభాషపై మక్కువ
తెలుగు భాషపై భక్తిభావం
రక్తానుగతంగా అబ్బిఉండవచ్చు గాక!!!!!!
కానీ,,,,,,,,
వ్యక్తిగతమైన,వృత్తిపరమైన
కఠోరసాధన, అంకితభావం
లేకుండా…ఏ విద్యా ఊరికే అందిరాదన్నది అక్షరసత్యం

మా అభినవరాముడు
మా అందరి దేవుడు
నందమూరి తారకరాముడు
తెలుగువెలుగుల కేతనాన్ని
విశ్వవీధిన ఎగరేసి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపిన
ఆ మాహనీయుడి
“వారసత్వం”….
“వర”సత్య మైనట్టుల…
అప్పుడు…” శివశంకరీ “
ఇప్పుడు….”శ్రీరామదండకం”
ఆహా!!!!!!!!!🙏
అలవోకగా,
మీరు పలికినతీరుకి….
దీర్ఘసమాస పదభూయిష్ట
వాక్ ప్రవాహానికి…..
అబ్బురపడుతున్నాం..
ఆనందిస్తున్నాం….

ఆ తారకరముడి గళసీమన
ఈ బాలకృష్ణుడి
శ్రీరామదండకం..పూదండగా
చేరి….
ఆత్మానందభరిత
ఆనందాశ్రువుల సాదృశ్యమైంది……

సాంఘిక,జానపద
పౌరాణికాలకైనా…..
తెలుగు, సంస్కృత,పలు
భాషాలకైనా……..
పాత్రోచిత వాచికసొబగులకైనా…
మీరు చూపించే శ్రద్దాసక్తులు
మీరందించే భిన్న కళారూపాలు….
మాలాంటివారికి
మార్గదర్శకాలు…….

ఏదీ…అప్పణంగా రాదు
సాధించాలంటే “సాధన”
చేయాలని….
ప్రత్యక్షంగా, పరోక్షంగా..
మీరు రుజువుచేస్తూనే ఉన్నారు……

అన్నయ్యా…మీనుండి
మరెన్నో….
అద్భుతాలు, ఆశ్చర్యాలు,
ఆనందాలు…రావాలని కోరుకుంటూ….🙏ఉత్తేజ్