మరో కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్…

చేసిన మూడు సినిమాలతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ తన లేటెస్ట్ సినిమాని అనౌన్స్ చేశాడు. ఆ, జాంబీరెడ్డితో ఆడియన్స్ కి డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ మరో డిఫరెంట్ కంటెంట్ తో సినిమా చేయబోతున్నాడు. ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సంధర్భంగా మే 29న #PV4 ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకి టైటిల్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. జాంబీ లాంటి కొత్త జానర్ ని మన ఆడియన్స్ కి చూపించిన ప్రశాంత్ వర్మ, ‘#PV4’ మూవీతో ఎలాంటి కాన్సెప్ట్ ని మనకి చూపించబోతున్నాడో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాలి.