‘క్రిష్ 4’లో హీరోయిన్ ఫిక్స్

హృతిక్ రోషన్ హీరోగా రానున్న ‘క్రిష్ 4’ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కన్ఫామ్ అయింది. ఊర్శశి రౌతేలాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు కియారా అద్వానీ, కృతి సనన్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారు. కానీ ‘వర్జిన్ భానుప్రియ’ సినిమాతో పాటు ‘కబిల్’ సినిమాలోని ‘సారా జమానా హసీనో కా దివానా’ పాటలో ఊర్శశి రౌతేలా ఫర్‌ఫామెన్స్ చాలా బాగుంది. ఆ ఫర్‌ఫామెన్స్‌ను చూసే ‘క్రిష్ 4’ కోసం ఊర్శశి రౌతేలాను తీసుకున్నట్లు తెలుస్తోంది.

urvasi rautela

ఇటీవల ‘వోహ్ చాంద్ కహాసే లావోగి’ మ్యూజిక్ వీడియోలో ఊర్శశి కూడా కనిపించింది. ఇది యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ వన్‌గా ఉంది. ప్రస్తుతం వరుస సక్సెస్ పుల్ సినిమాలతో ఊర్శవి రౌతేలా మంచి ఫామ్‌లో ఉంది. ఈ క్రమంలో హృతిక్ సరసన అవకాశం దక్కింది.

త్వరలోనే క్రిష్ 4 సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే క్రిష్ 4లో ఇద్దరు హీరోయిన్ల ఉంటారని, ఒక హీరోయిన్‌గా ఊర్వశిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక మరో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఇంకా బయట పడలేదు. త్వరలోనే హీరోయిన్ల ఎంపిక గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.