Uppena: ఉప్పెన స‌క్సెస్ మీట్‌.. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్!

Uppena: వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్ల్‌గా న‌టించిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇందులో న‌టించిన ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ హీరో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి విల‌న్ పాత్ర చేయ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు ప్రేక్ష‌కుల్లో నెల‌కొన్నాయి. దాదాపు 100కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకోవ‌డంతో.. ఈ చిత్రబృందం విజ‌యోత్స‌వాల‌ను నిర్వ‌హించింది.

Uppena success meet

ఈ Uppena చిత్రానికి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌.. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ విజ‌యోత్స‌వ వేడుక‌ల్లో.. ఉప్పెనUppena చిత్ర‌బృందంతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లుఅర్జున్‌, సాయితేజ్‌, సుకుమార్‌, గోపీచంద్ మ‌లినేని, హ‌రీశ్ శంక‌ర్‌, వేణు శ్రీ‌రామ్‌, దిల్ రాజు, ప్ర‌సాద్ పొట్లూరి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.