Powerstar: ప్ర‌మోష‌న్స్ మొదలు పెట్టిన ‘వ‌కీల్‌సాబ్‌’..

Powerstar: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం వ‌కీల్‌సాబ్‌. ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అయింది.. ఇప్ప‌టికే ఈ చిత్రంకు సంబంధించి టీజర్‌, పోస్ట‌ర్స్‌, లీక్స్‌, సాంగ్స్ ప్రేక్షకాభిమానుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. ప‌వ‌న్ రీఎంట్రీ ఇస్తున్న చిత్రం కాబ‌ట్టి తెర మీద చూడాల‌ని ప‌వ‌న్ Powerstar అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఉగాది కానుక‌గా ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల్లో ఆందోళ‌న ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి.

vakeelsaaab

ఎందుకంటే వ‌కీల్‌సాబ్ చిత్రం రిలీజ్‌కు ద‌గ్గ‌ర‌గా వుండ‌డంతో ఎక్క‌డ కూడా ప్ర‌మోష‌న్స్ చేయ‌ట్లేదు.. అస‌లు ఈ సినిమా బాగా వ‌చ్చిందా అనే అనుమానం Powerstar అభిమానుల్లో నెల‌కొన్నాయి. ఈ నేప‌ధ్యంలోనే ప‌వ‌న్ అభిమానుల‌ను తాజాగా ఖుష్ చేశారు చిత్ర‌బృందం. ప్ర‌మోష‌న్స్ భాగంగా ఎల‌క్ట్రానిక్ మీడియా కోసం డైరెక్ట‌ర్ వేణు శ్రీ‌రామ్‌తో పాటు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రిల‌తో ఓ ఇంట‌ర్వ్యూ చేయించారు. ఇక ఏప్రిల్ 3న హైద‌రాబాద్‌లోని యూస‌ఫ్‌గూడ‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నారు చిత్ర‌బృందం.