RGV: డి కంపెనీ రిలీజ్ వాయిదా.. ఫ్యాన్స్‌ను నిరాశ‌ప‌రిచిన ఆర్‌జీవి!

RGV: వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం డి కంపెనీ. ఈ చిత్రం కు సంబంధించి పోస్ట‌ర్ల్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, అలాగే బోల్డ్ బ్యూటీ చేసిన ఐటెం సాంగ్ రిలీజ్ చేసిన చిత్ర‌బృందం.. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ప్రేక్ష‌కుల్లో నెల‌కొన్నాయి.. మరీ ముఖ్యంగా యువ‌కులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్‌జీవి సినిమా.. క్రైమ్ సీన్స్‌తో పాటు అడ‌ల్ట్ సీన్స్ ఎక్కువ‌గా ఉంటాయి.. అందులో హాట్ బ్యూటీ అప్స‌ర‌రాణి ఐటెం సాంగ్‌లో త‌న హాట్ హాట్ అందాల‌ను చూపించింది.

Rgv d company

ఇక ఈ చిత్రం మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉంది.. కానీ ఆర్‌జీవీRGV త‌న అభిమానుల‌ను నిరాశ ప‌రిచాడు.. ఈ చిత్ర రిలీజ్ ‌ను వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో పాటు.. కొత్త లాక్‌డౌన్‌పై నిర‌వ‌ధికంగా వస్తున్న నేప‌థ్యంలో.. మా డి కంపెనీ చిత్రం విడుద‌ల‌ను వాయిదా వేస్తున్నాం .. కొత్త విడుద‌ల తేదీని వీలైనంత త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం అంటూ ట్వీట్ చేశాడు ఆర్‌జీవి.