గత 15 ఏళ్లకు పైగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష చాలా వరకు వివాదాలకు దూరంగా ఉండాలనే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ ఆమె పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక నాలుగు పదుల వయసు దగ్గర పడుతుండడంతో త్రిష పెళ్లి చెసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఆమె పలువురు హీరోలతో ప్రేమలో పడినట్లు అనేక రకాల రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ మధ్య తన సీక్రెట్ బేయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని అయితే అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్ అయినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఫైనల్ గా ఆమె ఇప్పుడు ఒక కాంట్రవర్సీ హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.
ఆ హీరో మరెవరో కాదు. శింబు. నయనతార, హన్సిక వంటి స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పిన శింబు ఇప్పుడు త్రిషపై మనసు పారేసుకున్నట్లు టాక్ వస్తోంది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలని ఒక నిర్ణయానికి కూడా వచ్చారట. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు గాని కోలీవుడ్ లో మాత్రం రోజుకో రూమర్ వస్తోంది. మరి ఈ విషయంపై త్రిష ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.