ఛలో దర్శకుడితో చరణ్.. కుదరకపోతే మరో హీరో..

ఛలో సినిమాతో సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ హిట్ అందుకున్న యువ దర్శకుడు వెంకీ కుడుముల ఆ తరువాత నితిన్ తో భీష్మ సినిమా చేసి మరో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ ఈ సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వెంకీ ఇద్దరు హీరోలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ కోసం ఒక మాస్ మసాలా కథను రెడీ చేసిన ఈ దర్శకుడు దాదాపు గ్రీన్ సిగ్నల్ ఆందుకున్నట్లేని తెలుస్తోంది. అయితే చరణ్ RRR ముగిసే వరకు మరో సినిమా చేయాలని అనుకోవడం లేదు. అదే విధంగా వంశీ పైడిపల్లితో కూడా ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వచ్చింది. మధ్యలో ప్లాన్ చేంజ్ అయితే వెంకీ కుడుములతోనే నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయవచ్చట.

ఇక మరొక హీరో న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ దర్శకుడి లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఒక పాయింట్ ని వినిపించిగా నాని ఏ మాత్రం గ్యాప్ దొరికినా చేయాలని రెడీగా ఉన్నాడట. ప్రస్తుతం నాని టక్ జగదీశ్ తో పాటు శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. అందులో ఎదో ఒక సినిమా షూటింగ్ పూర్తయితే వెంకీ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.