దిల్ రాజు నిర్మించిన చిత్రం V ఇటీవల నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయడం ద్వారా మంచిదయ్యిందనే కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం దిల్ రాజు ఈ చిత్రాన్ని ఓటీటీలో అమ్మడం ద్వారా మంచి లాభాలు వచ్చాయని కూడా వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దాదాపు 15కోట్ల వరకు లాభం పొందినట్లు టాక్.
ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను దిల్ రాజు 31 కోట్లకు విక్రయించాడు. 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 7కోట్లని తెలుస్తోంది. ఇక ఆడియో హక్కులతో సహా దిల్ రాజు ₹ 15 కోట్ల లాభం పొందారని టాక్ వస్తోంది. ఒక విధంగా కరోనా కష్ట కాలంలో ఈ సినిమాకు వచ్చిన లాభాలు ఒక బోనస్ అనే చెప్పాలి. థియేటర్స్ దొరక్కపోయినా కూడా భవిష్యత్తులో రిస్క్ లేకుండా ఓటీటీ బిజినెస్ తో సేఫ్ జోన్ లోకి రావచ్చనే క్లారిటీ వచ్చేసింది. ఇంద్రగంటి మోహనా కృష్ణ దర్శకత్వం వహించిన V సినిమాలో నాని, సుధీర్ బాబు, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ ను ఎక్కువగా అందుకుంటోంది.