‘డ్రగ్స్’ కేసు.. ఆ ‘హీరోయిన్’ కి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే కష్టంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలని అంటుంటారు. చాలా వరకు స్టార్ డమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. అయితే ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టయిన బుజ్జిగాడు సెకండ్ హీరోయిన్ సంజనా గల్రాని కూడా అదే తరహాలో ఆలోచించి గట్టిగానే ఆస్తులు సంపాదించుకుందట.

కానీ ఈ విషయంలో అనేక రకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. సంజాన తన కెరీర్ లో అనుకున్నంతగా పెద్ద సినిమాలు చేసింది లేదు. కన్నడలో మాత్రం కొంచెం బిజిగానే ఉన్నప్పటికీ అక్కడ బిల్డింగ్ లు కొనేంత రెమ్యునరేషన్ ఇవ్వరని అందరికి తెలిసిందే. కానీ విచారణలో సంజనా ఆస్తుల లెక్కల గురించి తెలుసుకొని అధికారులు షాక్ అయినట్లు తెలుస్తోంది. ఫ్లాట్స్ తో పాటు ల్యాండ్స్ ఇతర నగదు లెక్కలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారని సమాచారం. మరి ఈ కేసులో సంజనా ఎవరి పేర్లు బయటపెడుతుందో చూడాలి.