‘షూటింగ్’ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన “రకుల్”!!

మొత్తనికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డేత్ కేసు ఊహించని ట్విస్ట్ లతో ఎన్నో చీకటి రహస్యాలను వెలుగులోకి తెస్తోంది. ఇక చివరికి రియా చక్రవర్తి డ్రగ్స్ వ్యవహారం ఆఖరికి టాలీవుడ్ ని కూడా తాకింది. ఆల్ మోస్ట్ రకుల్ ప్రీత్ కూడా డ్రగ్స్ వాడినట్లు నేషనల్ మీడియాలో టాక్ అయితే వస్తోంది. రియా చక్రవర్తి, అలాగే రకుల్ కి చాలా కాలంగా ఫ్రెండ్షిప్ ఉన్నట్లు అందరికి తెలిసిందే.

ఇటీవల ఆమె క్రిష్ జగర్లముడి చిత్రం కోసం వికారాబాద్ అడవిలో షూటింగ్ కి వెళ్ళింది. ఇక డ్రగ్స్ వార్త గురించి తెలుసుకున్న రకుల్ షూట్ ను మధ్యలో వదిలేసి వెళ్లిపోయిందట. మీడియా సంప్రదించడానికి ప్రయత్నం చేయగా.. ఆమె మేనేజర్‌ సమాధానం ఇచ్చారు. రకుల్ ప్రస్తుతం ఏమీ మాట్లాడనని మీడియాకు తెలియజేశాడు. రకుల్ మరియు రియా మంచి స్నేహితులు మరియు వారు నేవీ నేపథ్యాల నుండి వచ్చారు. ఇద్దరి ఫొటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇప్పుడు రియా కారణంగా డ్రగ్స్ కేసులో రకుల్‌ కూడా చిక్కుకోవాల్సి వస్తోంది.