కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది అంతా ఇంటికే పరిమితమయ్యారు జనం. దీంతో థియేటర్లు మూతపడటం, షూటింగ్‌లు బంద్ అయ్యాయి. అయితే లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్ పూర్తి చేసుకునన్న సినిమాలు కొన్ని ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక టీవీల్లో ప్రసారమయ్యే సినిమాలను చూస్తే ప్రేక్షకులు లాక్డౌన్లో ఎంజాయ్ చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం వస్తున్న క్రమంలో ఈ ఏడాది జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.
సినిమాల విషయానికొస్తే. ఈ ఏడాది టీవీల్లో భారీ టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకున్న టాప్ 5 సినిమాలు ఏంటో చూద్దాం. సినిమాల్లో ఈ ఏడాది మహేష్ హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ దక్కించుకుని తొలి స్థానంలో నిలిచింది. జెమిని టీవీ రెండు సార్లు ఈ సినిమాను ప్రసారం చేయగా.. తొలిసారి 29.4 టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.
ఇక రెండో స్థానంలో స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అవ వైకుంఠపురములో సినిమా ఉంది. ఈ సినిమా కూడా జెమినీ టీవీలో ప్రసారం అవ్వగా.. ఇది 23.4 టీఆర్పీ రేటింగ్స్‌తో రెండో స్థానంలో ఉంది. ఇక జెమినీ టీవీలో రెండోసారి ప్రసారమైన సరిలేరు నీకెవ్వరు సినిమా 17.4 టీఆర్పీ రేటింగ్స్ మూడో స్థానంలో ఉంది. ఇలా టాప్ 5లో మహేష్ సినిమాలో సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి స్థానంతో పాటు మూడో స్థానంలో కూడా నిలించింది. స్టార్ మా టీవీలో ప్రసారమైన ప్రతిరోజు పండగే సినిమా 15.3 టీఆర్పీ రేటింగ్స్‌తో నాలుగో స్థానంలో ఉండగా.. జెమినీ టీవీలో ప్రసారమైన సైరా నరసింహారెడ్డి 11.8 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉంది.