క్లైమాక్స్‌కు చేరుకున్న కేజీఎఫ్ 2

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లాక్డౌన్ తర్వాత ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ముగిసే అవకాశం ఉండగా.. వచ్చే సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ త్వరలో షూటింగ్‌లో పాల్గొననుండగా.. సంజయ్‌తో యశ్ తలపడే యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

KGF2

ఇవి సినిమాలోని క్లైమాక్స్ యాక్షన్ సీన్లు అని తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాలకు స్టంట్స్ మాస్టర్స్ అన్బు , అరివులు నేతృత్వం వహిస్తుండగా.. సినిమాకే ఈ యాక్షన్ సీన్లు హైలెట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాలో రాకీభాయ్‌గా యష్ నటిస్తుండగా.. అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరిమధ్య చోటుచేసుకునే యాక్షన్ సీన్లను ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారు.

హంబుల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడదలు కానుంది.కేజీఎఫ్ 1 భారీ కలెక్షన్లు సాధించడంతో.. కేజీఎఫ్ 2 అంత కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించే అవకాశముంది.