ఈ ఏడాది అంతా వీళ్ల గురించే

2020వ ఏడాది ముగియనుండటంతో ఈ ఏడాది ట్విట్టర్‌లో ట్రెండ్ అయిన, ఎక్కవమంది లైక్ చేసిన, రీ ట్వీట్ చేసిన వివరాలను ట్విట్టర్ వెల్లడించింది. తనకు కరోనా సోకిందని అమితాబ్ బచ్చన్‌ అధికారికంగా ప్రకటిస్తూ చేసిన ట్వీట్‌ ఈ సంవత్సరంలో అత్యధికంగా కోట్ చేయబడిన ట్వీట్ గా నిలిచింది. ఇక సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ విజయ్ తన అభిమానులతో దిగిన సెల్పీ ఎక్కువమంది రీ ట్వీట్ చేసిన ట్వీట్‌గా నిలిచింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భవతి అయినట్లు చేసిన ట్వీట్‌ ఎక్కువ లైక్‌లు పొందిన ట్వీట్‌గా నిలించింది.

AMITABACCHAN

ఈ ఏడాది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూవీ #DilBechara టాప్ మూవీ హ్యాప్ ట్యాగ్‌గా నిలిచింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన అభిమానులతో దిగిన ఫొటోను లక్షా 45 వేల మంది రీ ట్వీట్ చేశారు. తాను కరోనా నుంచి కోలుకుని త్వరలో తిరిగి వస్తానంటూ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్‌ను 4 లక్షల 43 వేల మంది లైక్ చేశారు.

ఇక బ్లాక్ ఫాంథర్ నటుడు చాడ్విక్ బోస్మాన్ చనిపోయినట్లు ప్రకటిస్తూ అతడి కుటుంబ సభ్యులు చేసిన ట్వీట్ భారతదేశంలో అత్యధిక రీట్వీట్లు, లైక్స్, కోట్ చేసిన ట్వీట్‌గా నిలిచింది. అలాగే పాలిటిక్స్ విషయానికొస్తే.. లాక్‌డౌన్ నేపథ్యంలో దీపాలు వెలిగించాలని కోరుతూ ప్రజలకు మోదీ సూచించిన ట్వీట్ ఎక్కువమంది రీ ట్వీట్ చేసిన ట్వీట్‌గా నిలిచింది.