అనుష్క కూడా ‘నిశ్శబ్దం’గా వచ్చేస్తుంది

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క బాహుబలి తర్వాత బాగా గ్యాప్ తీసుకోని నటిస్తున్న సినిమా నిశ్శబ్దం. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనుష్క ఈ మూవీలో మూగ అమ్మాయి పాత్రలో నటిస్తోందనే విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన నిశ్శబ్దం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అనుష్కని థియేటర్స్ లో ఎప్పుడు చూస్తామా అని అభిమానులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు.

కరోనా కారణంగా థియేటర్స్ ఓపెన్ చేయడానికి సమయం పడుతుండడంతో మేకర్స్ అంతా తమ సినిమాలని ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ నిశ్శబ్దం సినిమాని థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్తూ వచ్చిన చిత్ర యూనిట్, దానికి ఇంకా సమయం పడుతుండడంతో ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్, నిశ్శబ్దం అక్టోబర్ 2న ప్రైమ్ లో విడుదల కాబోతుందని చెప్పేశారు. మొత్తానికి ఏడాది నిరీక్షణని చెరిపేస్తూ అనుష్క నిశ్శబ్దంగా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్దమయ్యింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.