షూటింగ్ మొదలుపెట్టిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్

అక్కినేని కుర్రాడు అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. గీత ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ మూవీలో పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది. గ్రాండ్ గా మొదలైన ఈ మూవీ షూటింగ్ కి కరోనా కారణంగా కాస్త గ్యాప్ పడింది. బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ తీసిన భాస్కర్ చాలా రోజుల తర్వాత తెరకెక్కిస్తున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాతో కంబ్యాక్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

షూటింగ్ పర్మిషన్స్ ఇవ్వడంతో అఖిల్ పూజ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సెట్స్ కి వచ్చేశారు. ఈ టైంలో తీసిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నీట్ గా ఫార్మల్ డ్రెస్ లో అఖిల్ ఉండగా, టామ్ బాయ్ గెటప్ లో పూజ కనిపించింది. ఈ ఇద్దరి పెయిర్ చూడడానికి ఫ్రెష్ గా కనిపిస్తోంది. ఇటీవలే రిలీజ్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.