సీనియర్ జర్నలిస్ట్, మ్యూజికాలజిస్ట్ శ్రీ రాజా గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులైన శ్రీ రాజా ‘వార్త’ దిన పత్రిక సినిమా పేజీ ఇన్ ఛార్జ్ గా, ‘హాసం’ పక్ష పత్రిక సంపాదకుడిగా, ‘మాటీవీ’ ఛానెల్ సినీ విభాగంలోనూ పనిచేశారు. ఈ రోజు సాయంత్రం వారి పార్థీవ దేహానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. వారి హఠాన్మరణానికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తీవ్ర సంతాపాన్ని తెలియచేస్తోంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తోంది.