ఏ ‘థియేటర్స్’ మూసివేస్తున్నారో వాళ్ళ ‘లైసెన్స్’ రద్దు చేయాలి!!

నిర్మాత నట్టికుమార్ మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ -35 పాస్ చేసారు, జగన్ గారు ఆ జీవో వకీల్ సాబ్ కి వ్యతి రేఖంగా పాస్ చేసారు అని అనుకుంటున్నారు.అది తప్పు అ ఈస్ట్ గోదావరి జాయింట్ కలెక్టర్ ఆర్డర్ కరెక్ట్, దానిలో చిన్న సవరణ చేయవలసిన కొన్ని వున్నాయి.రాత్రి సడన్ గా మీటింగ్ పెట్టారు థియేటర్స్ బంద్ వకీల్ సబ్ థియేటర్ తప్పు అంట ఇది కరెక్ట్ కాదు ఎవరైతయి బంద్ చేస్తున్నారో వాళ్ళ లైసెన్స్ కాన్సల్ చెయ్యాలి. జగన్ గారు ఫస్ట్ టైం డివిజన్ బెంచ్ ఆర్డర్ కి వెళ్లారు, కొంతమంది తెలంగాణ ఎక్సిభిటర్స్ ఈ విషయం లో మమ్మల్ని లాగవద్దు అన్నారు వాళ్ళకి కృతజ్ఞతలు. థియేటర్స్ జీవో మిడిల్ క్లాస్ కి అను కూలంగా వుంది. బంద్ చేస్తే అన్ని థియేటర్స్ బంద్ చేయాలి. రేపు నా సినిమా రిలీజ్ వుంది నాకు కూడా బాధగా వుంది.దీనికి నేను కోర్ట్ కి కూడా వెళ్తాను అని అన్నారు

ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ జేవీ మోహన్ గౌడ్ మాట్లాడుతూ… Ap గవర్నమెంట్ నిర్ణయం వల్ల సముఖత వ్యక్తం చేస్తున్నాను, ఫిక్స్డ్ కరెంటు చార్జెస్ మూడు నెలలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలు వాయిదా వేసింది.సామాన్యుడికి ఇబ్వంది కలగకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది.ఇలాంటి ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఏ థియేటర్స్ మూసివేస్తున్నారో వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి అని కోరుతున్నానని అన్నారు.