బన్నీ తన ఫేవరేట్ హీరో అంటున్న బాలీవుడ్ హీరో

సినిమాకు సినిమాకు డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ ఉంటాడు స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్. తెలుగులో స్ట్రైల్‌కు అల్లు అర్జున్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఫ్యాషన్‌కి తగ్గట్లు ప్రతి సినిమాలో లుక్ మారుస్తూ స్ట్రైలిష్‌గా కనిపిస్తాడు. అలాగే విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు బన్నీ. తెలుగులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న బన్నీకి ఇతర భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్‌ని చాలామంది ఇష్టపడతారు.

allu arjun

లాక్‌డౌన్‌కి ముందు విడుదల అయిన అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. ఈ సినిమాలోని పాటలు రికార్డు సృష్టించడంతో.. పాన్ ఇండియా స్టార్‌గా బన్నీ ఎదిగాడు. ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియాలో సినిమా పుష్పలో బన్నీ నటిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళంలోకి ఈ సినిమా డబ్ కానుంది.

అయితే బన్నీకి బాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ సెన్సేషనల్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ బన్నీకి అభిమాని అట. తెలుగులో బన్నీ హీరోగా వచ్చిన ‘పరుగు’ సినిమా బాలీవుడ్‌లో రీమేక్ అవ్వగా. ఇందులో టైగర్ ష్రాఫ్ నటించాడు. తాజాగా టాలీవుడ్‌లో మీ ఫేవరెట్ హీరో ఎవరు అని ఒక నెటిజన్ ఆయనను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా తాను అల్లు అర్జున్ అభిమానిని అని, బన్నీ లానే తాను కూడా నడవాలి అనుకుంటున్నానని చెప్పాడు.