టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బన్నీ వాసు సోదరుడు సురేష్ అనారోగ్యంతో కన్నుమూశాడు. ప్రస్తుతం అతడు బెంగళూరులో ఉంటుండగా.. కొద్దికాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆరోగ్యం మరింత విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల మరణించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. సోదరుడి మృతితో బన్నీ వాసు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

bunny vasu

సురేష్‌కు భార్య,కుమారుడు ఉన్నాడు. సురేష్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం డీజిల్, పెట్రోలు 4 వీలర్ వాహనాలను కంప్రెసర్,నేచురల్ గ్యాస్‌లోకి మార్చే కిట్లను తయారు చేసే కంపెనీ స్థాపించారు. ఆ కంపెనీ సక్సెస్‌పుల్‌గా నడుస్తోంది.

సోదరుడి మృతితో విషాదంలో ముగినిపోయిన బన్నీ వాసును పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అల్లు అరవింద్ ఫ్యామిలీకి బన్నీ వాసు అత్యంత నమ్మకస్తుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి పలు సినిమాలను నిర్మించారు.