రజనీ పొలిటికల్ ఎంట్రీపై చిరు కామెంట్స్

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇవాళ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రెటీలతో పాటు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. రజనీకి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. రజనీ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు,. అలాగే పలు సేవా కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు రజనీ ఇప్పటికే ప్రకటించిన క్రమంలో రజనీ జరుపుకుంటున్న ఈ బర్త్ డే ఆయనకు స్పెషల్‌గా మారింది.

rajanikanth

ఇక రజనీకి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు విషెస్ చెప్పారు. తన ప్రియమైన మిత్రుడైన రజనీకి బర్త్ డే శుభాకాంక్షలు. మీకు అద్భుతమైన జీవితం కావాలని కోరుకుంటున్నాను. రాజకీయాల్లో ప్రవేశిస్తున్నందున మీరు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. మీదైన ప్రత్యేక శైలితో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. వారికి సేవ చేయడంలో కూడా ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తారని నమ్ముతున్నాను అని చిరంజీవి ట్వీట్ చేశాడు.

ఇక పుట్టిన రోజు శుభాకాంక్షలు రజనీకాంత్ సర్. మీరు లక్షలాది మందికి స్పూర్తినిస్తూ సినిమాలో శైలిని పునర్నిర్వచించడాన్ని కొనసాగించండి. మీకు మంచి ఆరోగ్యం.. ఆనందం .. శాంతి ఉండాలని కోరుకుంటున్నాన అని మహేష్ ట్వీట్ చేశాడు.