సన్నీలియోన్‌కు 20 ఏళ్ల కొడుకు.. అదొక అద్భుతం

ఇటీవల బాలీవుడ్ నటి సన్నీలియోన్, నటుడు ఇమ్రాన్ హష్మీల పేర్లను ఒక విద్యార్థి తన హాల్‌టికెట్‌లో పేర్కొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. బిహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌కు చెందిన కుంద‌న్ కుమార్ అనే 20 ఏళ్ల యువ‌కుడు ధనరాజ్‌ డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. హాల్‌టికెట్‌లో తన తండ్రి స్థానంలో ఇమ్రాన్ హష్మీ, తల్లి స్థానంలో సన్నీలియోన్ పేరు రాశాడు.

sunnyleone

హాల్‌టికెట్‌లో ఈ పేర్లను చూసి కాలేజీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా… దీనిపై గత కొద్దిరోజుల క్రితం ఇమ్రాన్ హష్మీ స్పందించాడు. అతడు నిజంగా తన కుమారుడు కాదని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా సన్నీలియోన్ దీనిపై స్పందించింది. ఆ విద్యార్థి చేసిన ప‌నికి స‌ర‌దాగా న‌వ్వుకున్న సన్నీలియోన్.. అత‌డు అద్భుతం అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది.

అయితే ఆ విద్యార్థి హాల్‌టికెట్‌లో తప్పుడు పేర్లను రాసినట్లు తెలుస్తోంది. దీనిపై చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. దీనిపై విచారణ చేపడుతున్నామని యాజమాన్యం చెబుతోంది. కాగా సన్నీలియోన్ పేరు ఇలా వార్తల్లో నిలవడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. గతంలో బిహార్ జూనియ‌ర్ ప‌రీక్ష‌లో స‌న్నీలియోన్ టాప‌ర్‌గా నిలిచింద‌ని, దీంతో ఆమె కోల్‌క‌తాలోని కళాశాల‌కు ఎంపికైంద‌ని వార్త‌లు వ‌చ్చాయి.