సమంతతో రచ్చ రచ్చ చేసిన బన్నీ

అక్కినేని కోడలు నాగచైతన్య ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు షోలు చేస్తోంది. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం కూలీమనాలీ వెళ్లడంతో దసరా రోజున బిగ్‌బాస్ షోను సమంత హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఏపిసోడ్‌తో తనలో ఉన్న యాంకర్ టాలెంట్‌ను కూడా సమంత బయటపెట్టింది. ఈ ఎపిసోడ్‌కు అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్ వచ్చాయి. దీంతో సమంతతో టాక్ షో ప్లాన్ చేసింది ఆహా యాప్. స్యామ్ జామ్ పేరుతో ఆహా యాప్‌ కోసం సమంత టాక్ షో చేస్తోంది.

samantha

ఈ టాక్ షోలో భాగంగా వివిధ రంగాలకు చెందని సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, తమన్నా, చిరంజీవిని ఇంటర్వ్యూ చేయగా.. తాజాగా అల్లు అర్జున్‌ని ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ఆహా యాప్‌లో ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది.

ఈ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఎలాంటి సీక్రెట్స్ బయటపెట్టాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఎపిసోడ్ త్వరంగా ప్రసారం అయితే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే తమన్నాను సమంత ఇంటర్వ్యూ చేసిన వీడియోకి సంబంధించిన ప్రొమో బయటికి వచ్చింది. ఆ ప్రమోలో విజయ్ దేవరకొండను కిస్ పెట్టుకోవాలని ఉందనే విషయం తమన్నా బయటపెట్టింది.