దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియన్ బిగెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమా షూటింగ్ కొంత మిగిలి ఉండడంతో దాన్ని పూర్తి చేయాలని మొన్నటివరకు రాజమౌళి ఎంతగానో కష్టపడ్డాడు. టెస్ట్ షూట్ కోసం ఒక ప్లాన్ రెడీ చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ టెస్ట్ షూట్ క్యాన్సిల్ కావడానికి అసలు కారణం ఏమిటనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం తక్కవ మంది టెక్నీషియన్స్ తో షూటింగ్ చేయడానికి ఏ మాత్రం వీలు పడటం లేదట. అసలైతే రాజమౌళి ప్లాన్ చేసుకున్న షూటింగ్ కోసం 250 నుంచి 300 మంది టెక్నీషియన్స్ అవసరం అవుతోందట.
కానీ అంత మంది సభ్యులతో షూటింగ్ చేయడం కుదరని పని. సాధారణంగా ఒక సీరియల్ కోసం 30 నుంచి 40 మంది షూటింగ్ లో ఉంటేనే కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం వలన మరో దారిలేక జక్కన్న కూడా రిస్క్ చేయకూడదని షూటింగ్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం.