కరోనా వల్ల ఈ ఏడాది అందరికీ బ్యాడ్ ఇయర్‌గా మారింది. ఇక సినిమా స్టార్లకు అయితే మరీ బ్యాడ్ ఇయర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా షూటింగ్‌లు బంద్ కావడం, థియేటర్లు మూతపడటంతో సెలబ్రెటీలందరూ ఇంటికే పరిమితయ్యారు. ఎప్పుడూ షూటింగ్స్‌తో బిజీగా ఉండే సెలబ్రెటీలకు ఇంట్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దీంతో ఈ ఏడాది సినిమాల పరంగా కాకుండా సేవా కార్యక్రమాలతో హీరో, హీరోయిన్లు వార్తల్లో నిలిచారు.
‘2020 సంవత్సరపు న్యూస్ మేకర్స్’గా పలువురు రికార్డులకెక్కారు. ఈ జాబితాలో అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, సోనూసూద్, ప్రతీక్ గాంధీ ఉన్నారు. కరోనా కష్టకాలంలో పీఎం కేర్స్ ఫండ్‌కు అక్షయ్ రూ.25 కోట్లు డొనేట్ చేసి అందరి మనస్సులను గెలుచుకున్నాడు. ఇక ఢిల్లీలోని JNTUలో విద్యార్థులపై దాడి జరిగిన సమయంలో.. వారిని దీపికా పదుకొణే పరామర్శించడం మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
ఇక ఈ సంవత్సరం మొత్తం కంగనా రనౌత్ వివాదాలతో వార్తల్లో ఉంటూనే ఉంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, డ్రగ్స్ కేసుపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం రేపాయి. ఇటీవల రైతుల ఉద్యమంపై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఇక ప్రతీక్ గాంధీ తన ‘స్కామ్ 1992’ సినిమాతో ఈ సంవత్సరం హాట్‌టాపిక్‌గా మారాడు. ఈ సినిమాలో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది.