ట్విట్టర్‌లో మహేష్ బాబు సంచలన రికార్డు

సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు తెలుగులో ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న మహేష్‌కు ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. తెలుగులోనూ కాదు… సౌతిండియాలోనే మహేష్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా మహేష్‌ సోషల్ మీడియాలో సృష్టించిన ఒక రికార్డు గురించి తెలిస్తే.. ఆయనకు ఉన్న క్రేజ్ ఎంతో అర్థమవుతోంది.

maheshbabu

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే మహేష్ బాబు.. సినిమా డీటైల్స్‌తో పాటు ఫ్యామిలీతో దిగిన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. దీంతో సోషల్ మీడియాలో మహేష్‌ను చాలామంది ఫాల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మహేష్ రికార్డు సృష్టించాడు. ఎక్కువమంది ఫాలోవర్లను కలిగి ఉన్న దక్షిణాది హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు.

తాజాగా ట్విట్టర్‌లో మహేష్ ఫాలోవర్లు సంఖ్య 11 మిలియన్ ప్లస్కుకు చేరింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్‌కు 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా.. ఫేస్‌బుక్‌లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో టాలీవుడ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న హీరోగా కొనసాగుతున్నాడు. దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.