ఈ ట్రైలర్ ఒక టెక్నికల్ బ్రిలియన్స్

ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ నుంచి లేటెస్ట్ ఒరిజినల్ ట్రైలర్ బయటకి వచ్చింది. ది టుమారో వార్ అనే టైటిల్ తో వచ్చిన ఈ ట్రైలర్ ఒక టెక్నికల్ బ్రిలియన్స్. ప్రెజెంట్ లో ఉన్న మనుషులు, ఎలియెన్స్ తమపై ఫ్యూచర్ లో చేయబోయే దాడిని ఎదురుకోవడానికి చేసిన వార్ ఈ మూవీ థీమ్ లైన్. కూల్ గా ఫ్యామిలీ మధ్య ఓపెన్ అయిన ఈ రెండు నిమిషాల 47 సెకండ్ల ట్రైలర్ సెకండ్ సీన్ నుంచి స్పీడ్ అందుకుంది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, దిమ్మతిరిగే వార్ సీక్వెన్సెస్ ది టుమారో వార్ ట్రైలర్ స్పెషాలిటీ. 2051 నుంచి కొంతమంది మనుషులు భూమి మీదకి వచ్చి, ఇక్కడున్న మనుషులని ఫ్యూచర్ కి తీసుకోని వెళ్లి చేసే వార్ ఈ మూవీలో హైలైట్ కాబోతుంది. తన కూతురు కోసం ఫ్యూచర్ వెళ్లి వార్ చేసిన తండ్రి పాత్రలో క్రిస్ ప్రాట్ నటించాడు. క్రిక్ మెక్కె డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ మూవీ జులై 2న ప్రీమియర్ కాబోతుంది. ఈ విజువల్ వండర్ ఆన్లైన్ లో స్ట్రీమ్ అయ్యే లోపు ట్రైలర్ పై ఒక లుక్కేయండి. జులై 2nd డేట్ ని మీరే రిమైండర్ లో పెట్టుకుంటారు.

The Tomorrow War - Official Trailer (English) | Amazon Prime Video