హాలీవుడ్ సినిమా లేదు, అదంతా ఒట్టిమాటే కానీ…

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరో ఎవరు అనగానే ఇండస్ట్రీతో సంబంధంతో లేకుండా అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు ప్రభాస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సాహూ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రెబల్ స్టార్ ఈసారి హాలీవుడ్ లో మూవీ చేయబోతున్నాడు అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాదాపు అన్నీ న్యూస్ ఛానల్స్, వెబ్ మీడియాలు ఈ వార్త గురించి రాశాయి. వరల్డ్ మోస్ట్ సక్సస్ ఫుల్ ఫ్రాంచైజెస్ లో ఒకటైన యాక్షన్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ లో టామ్ క్రూజ్ తో ప్రభాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అనేది ఈ వార్త సారాంశం. సోషల్ మీడియాలో పుణ్యమాని ఈ వార్త అటు తిరిగి ఇటు తిరిగి మిషన్ ఇంపాజిబుల్ డైరెక్టర్ క్రిస్టెఫెర్ మెక్వారి వరకూ వెళ్లింది. దీంతో ట్విట్టర్ లో ఈ విషయంపై స్పందించిన డైరెక్టర్, ప్రభాస్ చాలా టాలెంటెడ్ మ్యాన్ కానీ ఇప్పటివరకూ మీట్ అవలేదని ఓపెన్ గా చెప్పేశాడు. దీంతో ఈ మిషన్ ఇంపాజిబుల్ 7లో టామ్ క్రూజ్ పక్కన ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే వార్తకి చెక్ పడింది.

భారీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టిన ప్రభాస్… ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలని సైమల్టేనియస్ గా షూట్ చేస్తున్నాడు. హ్యుజ్ బడ్జట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలే కాకుండా త్వరలో నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకోని వెళ్తున్నాడు. ఎటు చూసినా ప్రభాస్ మరో ఐదారేళ్ళ పాటు బిజీ బిజీ. వీటిలో ఏ రెండు హిట్ అయినా బాక్సాఫీస్ దెగ్గర రెబల్ స్టార్ వసూళ్ల వర్షమే కాదు సునామీ కూడా చూపించడం ఖాయం.