తమిళనాడులో కాదు దేశంలోనే బ్యాన్ చేయండి…

సమంత నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సిరీస్ ల్లో ఒకటిగా నిలిచిన ఈ సిరీస్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. త్వరలో అమెజాన్ లో ప్రీమియర్ అవుతున్న ఈ సిరీస్ ట్రైలర్ రీసెంట్ గా బయటకి వచ్చింది. నాలుగు రోజుల్లో 40 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ పై విడుదలైన రోజు నుంచే కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. స్వాతంత్రం కోసం పోరాడుతున్న తమిళ ఈలం గురించి ఈ ది ఫ్యామిలీ మ్యాన్ 2 టీం తప్పుగా ప్రచారం చేస్తుంది అని తమిళ ప్రజలు సోషల్ మీడియాలో ప్రొటెస్ట్ చేశారు. దీంతో అమెజాన్ వాళ్లు ట్రైలర్ లో డైలాగ్ మార్చాల్సి వచ్చింది. ఇక్కడితో సమస్య తీరిపోయింది అని అమెజాన్ ప్రైమ్ వాళ్లు అనుకున్నారు కానీ ది ఫ్యామిలీ మ్యాన్ 2 టీంకి ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్ ని విడుదల చేయకుండా ఆపాలని తమిళనాడు రాజ్యసభ ఎంపీ వైకో బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ కి లెటర్ రాసిన విషయం మర్చిపోయే లోపు… డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీ, తమిళనాడు సెంట్రల్ బ్రాడ్ కాస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయిన ప్రకాష్ జవదేకర్ కి ఓపెన్ లెటర్ రాశారు. తమిళుల మనోభావాలు కించ పరిచేలా ఉన్న ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ని తమిళనాడులోనే కాకుండా భారతదేశంలో ఎక్కడా విడుదల కాకుండా చూడాలి… రాష్ట్రంలో శాంతివిఘాతం జరుగుతుందని ఆయన సెంట్రల్ మినిస్టర్ ని కోరారు.

సిరీస్ కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ లు జరుగుతూ ఉండడంతో డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే బయటకి వచ్చారు. ఈ నిరసనల గురించి ఓపెన్ అయిన మేకర్స్ ట్రైలర్ లోని కొన్ని షాట్స్ మాత్రమే చూసి సీజన్ మొత్తం తమిళులకి వ్యతిరేకం అనుకోవడం కరెక్ట్ కాదు. మెయిన్ కాస్ట్ అండ్ క్రూ నుంచి కథ రాసిన వరకూ చాలా మంది తమిళులే ఉన్నారని, ఎవరి మనోభావాలు కించపరిచే ఉద్దేశం మాకు లేదని… సీజన్ రిలీజ్ అయ్యాక అందరూ తమని అప్రిషియేట్ చేస్తారని రాజ్ డీకే చెప్పారు. మరి రాజ్ అండ్ డీకే మాటలు నమ్మి ది ఫ్యామిలీ మ్యాన్ 2ని రిలీజ్ చేస్తారా? లేక సీజన్ 2 ఆగిపోతుందా అనేది తెలియాలి అంటే జూన్ 4 వరకూ ఆగాల్సిందే.