ఎపిసోడ్ 4: Eagle: భాస్కరన్ తను చేయబోయే మిషన్ కి రాజీనే ఎందుకు ఎన్నుకున్నాడు అనేది ప్రెజెంట్ చేయడానికి ఎపిసోడ్ 4 స్టార్టింగ్ లోనే… ఆరు నెలల్లోనే ఫైటర్ పైలట్ ట్రైనింగ్ ని కంప్లీట్ చేసిన రాజీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఈ సమయంలోనే రాజీ భాస్కరన్ ని మీట్ అవుతుంది. నాయకుడి ప్రశంశలు కూడా అందుకుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ని క్లోజ్ చేసి… ప్రెసెంట్ లో నందాని చంపినా సీన్ కి రాగానే రాజీ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి బ్లాక్ కవర్స్ లో పార్సిల్ చేస్తుంది. నందాని చంపగానే తను పని మానేస్తే తన పైనే అనుమానం వస్తుంది కాబట్టి రాజీ ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ తన పని తాను చేసుకుంటూ ఉండగా, పోలీస్ ఆఫీసర్ ఉమాయల్ ఎంక్వయిరీకి వస్తుంది. ఎదో కారణం చెప్పి అనుమానం రాకుండా రాజీ పోలీసులని డిసీవ్ చేస్తుంది.
ముంబైలో ఫ్యామిలీకి బై చెప్పిన శ్రీకాంత్… చెన్నైలోని జేకే అండ్ టీంతో జాయిన్ అవుతాడు. సూచి కూడా తన పాత మిత్రుడు అయిన ఆనంద్ పెట్టిన స్పార్క్ ట్రీ కంపెనీలో జాబ్ జాయిన్ అవుతుంది. ఒక పోర్ట్ కి వెళ్లిన రాజీ అక్కడ సెల్వతో పాటు మరో ఇద్దరు రెబల్స్ అయిన కార్తీక్ ప్రభుని కలుస్తుంది. ఈ ముగ్గురికి తోడు isi సాజిద్ కూడా కాలుస్తాడు. నలుగురు కలిసి TIGIRS AVIATION FLYING SCHOOL కి వెళ్లి అక్కడ ఎయిరో ప్లేన్ ని సిద్ధం చేసుకోని చేయబోయే అటాక్ కి ప్రిపేర్ అవాలని ప్లాన్ చేసుకుంటారు. అనుకున్నట్లుగానే టిగ్రీస్ వెళ్లి సెల్వ అండ్ రాజీ టీం ప్లేన్ ని రెడీ చేస్తారు. సమీర్ నుంచి సాజిద్ కి ఆయుధాలు కూడా అందుతాయి.
ఈలోపు నందాని చంపింది రాజీని అని డౌట్ వచ్చి ఉమాయల్, రాజీ అడ్రెస్ వెతుక్కుంటూ వస్తుంది. అదే సమయానికి శ్రీకాంత్ కూడా ఒక తమిళ టైగర్ యాక్టివ్ గా ఉందని తెలుసుకోని ఆ అడ్రెస్ కి వస్తాడు. రాజీనే తమిళ రెబల్ అనే విషయం తెలియని శ్రీకాంత్ ఆమె ఎదురు పడినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఉమాయల్ మాత్రం రాజీ ఇంటికి నేరుగా వస్తుంది, తను వచ్చే సమయానికి శ్రీకాంత్, జేకేలు నందా డెడ్ బాడీ దెగ్గర ఉండడంతో ఉమాయల్ శ్రీకాంత్ అండ్ జేకే టాస్క్ ఆఫీసర్స్ అని చెప్తున్నా వినకుండా అరెస్ట్ చేస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.
ఈ 4వ ఎపిసోడ్ లో మేకర్స్ భాస్కరన్ చేయాలి అనుకుంటున్న అటాక్ కి రాజీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఆ అటాక్ చేయడానికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా చేయబోతున్నారు అనేది చెప్పాడు.