ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ 3 రివ్యూ

ఎపిసోడ్ 3: Angle of Death: రాజీ ఫ్లాష్ బ్యాక్ గ్లిమ్ప్స్ తో ఎపిసోడ్ 3 స్టార్ట్ అవుతుంది. ఫారిన్ లో సమీర్ భాస్కరన్ కలిసి బసుపైన ఎటాక్ కి ఆయుధాల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా భాస్కరన్ చెన్నైలో ఉన్న నలుగురిని ఎంచుకుంటాడు. రాజీ ఎప్పటిలాగే ఫ్యాక్టరీకి వెళ్లి అక్కడ తన మేనేజర్ నందాతో తాను రేపటి నుంచి పనికి రాలేనని రిసైన్ చేస్తున్నానని చెప్తుంది.

ముంబైలో శ్రీకాంత్, సూచీల మధ్య ఆమె పుట్టిన రోజు నాడే గొడవ బాగా పెరిగి పోతుంది. ఇద్దరి మధ్యా మాట పెరగడంతో శ్రీకాంత్ అదే డిస్టర్బ్డ్ మైండ్ తో ఆఫీస్ కి వెళ్తాడు. ఆఫీస్ లో మేనేజర్ తో గొడవ అవ్వడంతో… తాను బయట ఇమడడం కష్టం అని తెలుసుకున్న శ్రీకాంత్… కులకర్ణికి కాల్ చేసి టాస్క్ లోకి రీజాయిన్ అవుతాడు.

నందాకి ఎప్పటి నుంచో రాజీపైన కోరిక ఉండడంతో అతను రాజీని సొంతం చేసుకోవాలని చూస్తాడు. నందా ఎక్కడ తన గురించి పోలీసులకి చెప్తాడో అని రాజీ నందాతో పడుకోవడానికి ఒప్పుకుంటుంది. నందా రాజీని అనుభవిస్తున్న సమయంలో అతని ఆమెని కొట్టడంతో రాజీకి శ్రీలంకన్ ఆర్మీ తనపై చేసిన పైశాచిక దాడి గుర్తొచ్చి నందాని అక్కడికి అక్కడే చంపుతుంది. నందాని చంపిన రాజీని ఫ్రేమ్ లో చూపిస్తూ ఎపిసోడ్ 3 ఎండ్ అయ్యింది.

ఈ 3వ ఎపిసోడ్ లో అభిమానులకి ఆఫర్ చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయినా… థింగ్స్ ని ఫాస్టర్ చేయడానికి ఆడియన్స్ ని హుక్ చేయడానికి ఈ ఎపిసోడ్ ని 33 నిమిషాల్లోనే ముగిస్తూ టైట్ ప్యాకెడ్ గా రాశారు. సమంత రాజీ పాత్రలోని పెయిన్ అండ్ క్రూయల్టీని, శ్రీకాంత్ మళ్లీ టాస్క్ లో జాయిన్ అవ్వడాన్ని వ్యూవర్స్ ఆస్వాదించొచ్చు.