Sonusood: ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తన భవనాన్ని హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ పోలీసులకు ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో సోనూసూద్ బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) నోటీసులను సవాల్ చేస్తూ ఆయన చేసిన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సోనూసూద్‌కు తాజాగా బాంబే హైకోర్టులో ఎదురు దెబ్బతగిలింది.. సోనూ పిటషన్‌ను బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జీ పృథ్వీరాజ్ చవాన్ కొట్టివేశారు.
జుహూలోని ఆరంతస్తుల భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చారంటూ బీఎంసీ గత ఏడాది అక్టోబర్‌లో నోటీసులు పంపింది. ఆ నోటీసులను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు సోనూసూద్. అయితే ఆయన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. రియల్ హీరోగా Sonusood దేశవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్న సోనూసూద్‌పై గతంలో బీఎంసీ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేరాలకు పాల్పడటం ఆయనకు ఓ అలవాటుగా మారిందని పేర్కొంది. ఎన్నిసార్లు చెప్పినా సోనూసూద్ వైఖరి మార్చుకోవడం లేదని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో సోనూసూద్ బాంబే హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో బీఎంసీ సోనూసూద్ గురించి ప్రస్తావిస్తూ.. నేరాలకు అలవాటు పడ్డ వ్యక్తిగా ఆయనను అభివర్ణించింది. దీంతో Sonusood సోనూసూద్ తీవ్రంగా ఖండించారు. నివాస భవనాన్ని హోటల్‌గా మార్చేందుకు బీఎంసీ నుంచి చేంజ్ ఆఫ్ యూజర్ అనుమతులు తీసుకున్నానని స్పష్టం చేశారు.