బాలీవుడ్‌లో మరోసారి సంచలనం రేపుతున్న ‘మీటూ’

గతంలో మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మీటూ పేరుతో సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైన లైంగిక వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్లు బయటపెట్టడం కలకలం రేపింది. పెద్ద పెద్ద డైరెక్టర్లు, నిర్మాతల పేర్లు మీటూ ఉద్యమంలో బయటికి వచ్చాయి. అయితే తాజాగా మరోసారి మీటూ ఉద్యమం బాలీవుడ్‌లో తెరపైకి వచ్చింది.

sherlin chopra mee too comments

బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా తాజాగా బాలీవుడ్ దర్శక,నిర్మాత సాజిద్ ఖాన్‌పై బాంబ్ పేల్చింది. 2005లో ఒక సినిమా డిస్కషన్ సమయంలో సాజిద్ ఖాన్ తనతో మిస్ బిహేవ్ చేశాడని తెలిపింది. కాగా గతంలోనే సాజిద్ ఖాన్‌పై మీటూ ఉద్యమంలో భాగంగా నటి జియ్ ఖాస్ సిస్టర్ ఆరోపణలు చేసింది. ఇప్పుడు మరోసారి ఆయనపై మీటూ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది.