GunaShekar:ఆ వార్తలు నమ్మవద్దంటున్న గుణశేఖర్

GunaShekar: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం హిరణ్యకశ్యప అనే పౌరాణిక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి టైటిల్ రోల్ ప్లే చేయనుండగా.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంతలోపు శాంకుతలం అనే సినిమాను గుణశేఖర్ తెరకెక్కించనున్నాడు.

GUNASEKHAR ABOUT SANKUNTAM MOVIE

శాంకుతలం సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటన వచ్చింది. అయితే సినిమాలో సమంత ప్రేమికుడు దుష్యుంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ చాలామంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై డైరెక్టర్ గుణశేఖర్ స్పందించాడు. ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతుందని, దుష్యంతుడి పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా ఖరారు కాలేదన్నారు. దీనిపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.