వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తండేల్ టీం

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తండేల్ చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. గురువారం స్వామి వారి విఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు నాగ చైతన్య, కథానాయకి సాయి పల్లవి, దర్శకుడు చందూ మొండేటి, చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, నాగ వంశీలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.

ఆలయం వెలుపల దర్శకుడు చందూ ముండేటి మాట్లాడుతూ…. “సినిమా ఘన విజయం సాధించాలని నిర్మాత నాగ వంశీ శ్రీవారిని కోరుకున్నారని తెలిపారు. సినిమా ఘనవిజయం సాధించడంతో చిత్ర సభ్యులంతా శ్రీవారి దర్శనార్థం వచ్చామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన, అవాంతరాలు వచ్చినా సినిమా భారీ విజయం సాధించడంలో శ్రీవారి ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు”.

అంతేకాక నేడు శ్రీకాకుళం ప్రాంతంలోని కోడి రామమూర్తి స్టేడియంలో జరగనున్న థాంక్యూ మీట్ కి వెళ్ళమన్నారు.