తన పొలిటికల్ జర్నీ పై స్పందించిన బన్నీ వాస్ – పవన్ కళ్యాణ్ తో ప్రయాణం…

తండేల్ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ నుండి బన్నీ వాస్ చురుకుగా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇటీవల మీడియా వారితో సంభాషిస్తున్న సమయంలో తన రాజకీయ జీవితంపై మీడియా వారు అడిగిన ప్రశ్నలకు బన్నీ వాస్ స్పందించడం జరిగింది. గత ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేద్దామని అనుకున్నాని, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తాను పోటీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వెళ్తే పూర్తిగా ప్రజలతో మమేకమై వారికి అందుబాటులో ఉండాలని, దానివల్ల తాను ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటున్న కొన్ని బాధ్యతలకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తనకి పోటీ చేసే అవకాశం వచ్చినా కూడా అటు ఆర్థికంగా అలాగే ఇటు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలు తనకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలపరంగా రెండు విధాలుగా ఆలోచించి తను పోటీ చేయలేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తితో పని చేయాలని అనుకుంటే నిష్టగా ప్రజా సేవలో ఉండాలి. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అలాకాకుండా నేను ఇక్కడ హైదరాబాదులో ఉంటూ నియోజకవర్గం యోగక్షేమాలు చూసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. తద్వారా ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం పోయే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి నమ్మకపోతే మళ్ళీ తిరిగి రావడం ఎంతో కష్టం. ఇవన్నీ తెలిసే నేను పిఠాపురం నుండి పోటీ చేసేందుకు వెనకడుగు వేశాను. నేను ఒకవేళ పూర్తిగా రాజకీయం జీవితంలోకి వెళ్లిపోయి నా కుటుంబ పరిస్థితులు అలాగే నా ఆర్థిక పరిస్థితులు అన్ని బాగానే ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది. అలా కాకుండా ఉన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లడం మంచిది కాదు అనే ఆలోచనతో నేను పోటీ చేయలేదు.