యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ షూటింగ్ చివరి దశలో ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీ మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన స్కోర్‌తో టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌తో మెస్మరైజ్ చేసారు. ఈ సినిమా మ్యూజిక్ జర్నీ ప్రారంభం కానుంది.
తండేల్ ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి నవంబర్ 21న రిలీజ్ కానుంది. సాంగ్ పోస్టర్ లో లీడ్ పెయిర్ నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య లవ్ అండ్ అఫెక్షన్ ని అందంగా చూపించారు. నాగ చైతన్య గడ్డంతో రగ్గడ్ చార్మ్ గా కనిపించగా, సాయి పల్లవి హాఫ్ శారీలో అందంగా ఉంది. వారి స్వచ్ఛమైన ఎక్స్ ప్రెషన్స్ హ్యాపీనెస్, సినిమాలో వారి బ్యూటీఫుల్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని ప్రజెంట్ చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల నుండి స్ఫూర్తితో రూపొందిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ, లవ్, యాక్షన్, డ్రామా, అడ్రినలిన్ మూమెంట్స్ బ్లెండ్ ని అందిస్తోంది.
ఈ చిత్రానికి షామ్‌దత్ డీవోపీ కాగా నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్. ఆర్ట్ విభాగానికి శ్రీనాగేంద్ర తంగాల నేతృత్వం వహిస్తున్నారు.
తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాస్
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో