తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్న కుమార్ మోహన్ వడ్లపట్ల, RRR & బాహుబలి సినిమా రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు.

ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, మరియు రాజ్యసభ సభ్యులు, గౌరవ శ్రీ కె.వి. విజయేంద్ర ప్రసాద్ గారు, ఈ రోజు (08-09-2022) తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యాలయమునకు విచ్చేసిన సందర్భంగా నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు శ్రీ టి. ప్రసన్న కుమార్ మరియు శ్రీ మోహన్ వడ్లపట్ల వారిని శాలువాతో సత్కరించిన సందర్భంగా శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘టాలీవుడ్ హబ్’ ను ఏర్పాటు చేయాలని, దీని కొరకు దక్షిణభారత చలచిత్ర ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణలను ఆహ్వానించి ఒక మహత్తరమైన సభను హైద్రాబాదులో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్ మరియు ఇతర సినిమా అసోసియేషన్స్ సహకారంతో ఏర్పాటుచేయాలని అలాగే ఈ సభకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరుగుతుందని, అయన వ్యక్తపరిచారు. దీని మూలంగా, ప్రపంచ ఖ్యాతి సంపాదించిన అనేక తెలుగు చిత్రాలు నిర్మించిన తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారత చిత్ర పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్తానం వహించగలదు.

గౌరవ కార్యదర్శి గౌరవ కార్యదర్శి
టి. ప్రసన్న కుమార్ మోహన్ వడ్లపట్ల