తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రెస్ నోట్

Natyam teaser

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సభ్యులు నిర్మాత శ్రీమతి సంధ్య రాజు, శ్రీ రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో కమల్ కామరాజు, శ్రీమతి సంధ్య రాజు నటించిన తెలుగు సినిమా “నాట్యం”. ఇండియన్ పనోరమా 2021కు ఎంపిక కావడం జరిగింది.ఈ సంవత్సరం సెలెక్ట్ కమిటీ (జ్యూరీ)లో తెలుగు అభ్యర్థులు ఎవరు లేకుండా “నాట్యం” ఒకటే తెలుగు సినిమా గా ఎంపిక కావడం గర్వకారణం.నిర్మాత శ్రీమతి సంధ్య రాజు, దర్శకులు శ్రీ రేవంత్ కోరుకొండ తదితర టీమ్ నెంబర్లను 21 నవంబర్ నుండి 28 నవంబర్ 2021 వరకు జరిగే ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో సన్మానం జరగనుంది.

ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరఫున మేము ఆనందం వ్యక్తం పరుస్తూ నిర్మాత శ్రీమతి సంధ్య రాజు, దర్శకులు శ్రీ రేవంత్ కోరకుండ మరియు “నాట్యం’ సినిమా సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము

ఇట్లు
టి.ప్రసన్నకుమార్(గౌరవ కార్యదర్శి)
మోహన్ వడ్లపట్ల(గౌరవ కార్యదర్శ)