ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. డిడిలో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు. 1978లో న్యూస్ చదవడానికి ఉద్యోగంలో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆయన వార్తలు చదివేవారు. 2011లో పదవీ విరమణ చేశారు.